సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా హిందీ,తమిళం, మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా విడుదల కానుంది.అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.సౌదీ అరేబియాలో ప్రీమియర్లతో పాటుగా అదే తేదీన సినిమాను కూడా విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.చెర్రీ అండ్ తారక్ అభిమానులు చాలా మంది ట్విట్టర్‌లో సినిమాను తమ దేశంలో విడుదల చేయాలని కోరడంతో 'RRR' టీమ్ ఈ విషయాన్ని ప్రకటించింది.తాజాగా ఈ హై బడ్జెట్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa