ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరలవుతున్న ఆరాధ్య బచ్చన్ వీడియో.... దండం పెడుతూ అభిషేక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 03:36 PM

ఆరాధ్య బచ్చన్... బాలీవుడ్ ప్రముఖ నటుడు,బిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్,మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ల గారాల పట్టి. అమితాబ్ బచ్చన్, జయబాధురిల ముద్దుల మనుమరాలు. తల్లితండ్రులతో పాటూ షికార్లకు వెళుతూ అప్పుడప్పుడూ మీడియా కంటికి చిక్కుతునే ఉంటుంది ఆరాధ్య.


తాజాగా ఆరాధ్య వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతుంది. ఆ వీడియో లోఒక ఆన్లైన్ ఎలక్యూషన్ లో భాగంగా ఆరాధ్య హిందీ లిటరేచర్, పోయెట్రీ  మీద స్పీచ్ ఇస్తుంది. ఈ చిన్నారి చెప్పిన విధానం,ఆమె హావభావాలు, భాష పలికిన తీరు చూసి ప్రేక్షకులు ముగ్ధులైపోతున్నారు. ఆరాధ్య ముత్తాత హరివంశ్ రాయ్ బచ్చన్ ను తలపిస్తుందని కొందరు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు.   


వైరలవుతున్న ఈ వీడియో ఆరాధ్య తండ్రి అభిషేక్ వరకు వెళ్లినట్టుంది. ఆరాధ్య ఫ్యాన్ పేజీ లో పోస్ట్ చేసిన ఈ వీడియో కి రిప్లై ఇస్తూ అభిషేక్ నమస్కరిస్తున్న చేతుల ఎమోజిని పెడుతూ ట్వీట్ చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa