రేపు ఉదయం 10 గంటలకు 'ఎత్తర జెండా' పాట విడుదల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ 'RRR' నుంచి 'ఎత్తర జెండా' అంటూ సాగే పాట రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు పాటను రిలీజ్ చేయాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాలతో రిలీజ్ చేయలేకపోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. రేపు ఉదయం 10 గంటలకు ఈ పాటను రిలీజ్ చేస్తామంది. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 25న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa