సినిమా హీరోయిన్, తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ యషికా ఆనంద్ ఇటీవల సంచలన విషయాలు వెల్లడించింది. ఇక జన్మలో తాను డ్రైవింగ్ చేయనంటూ పేర్కొంది. గతేడాది యషికా, ఆమె ఫ్రెండ్ ప్రయాణిస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు మరణించింది. తీవ్రగాయాలపాలైన యషిక మంచానికే పరిమితమై, ఇటీవల కోలుకుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. తాజా కొందరు అభిమానుల ప్రశ్నలకు స్పందిస్తూ, తీవ్ర ఉద్వేగానికి లోనైంది. తన వల్లే తన స్నేహితురాలు చనిపోయిందని, ఆమెను తానే చంపినట్లు పలువురు విమర్శిస్తున్నారని పేర్కొంది. ఆ భావన తనను కూడా వెంటాడుతోందని వివరించింది. తాను వేగంగా నడపడం వల్లే ఆ రోజు ప్రమాదం జరిగిందని, అందుకే ఇంకెప్పుడూ డ్రైవింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది.