ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం హర్ట్(71) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తన నాన్న72వ పుట్టినరోజుకు వారం రోజుల ముందు మార్చి13న చనిపోయారని తెలిపాడు. ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ వంటి సినిమాల్లో నటించిన విలియమ్ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన క్యాన్సర్ కారణంగానే చనిపోయారా లేక వృద్దాప్యపు సమస్యలతో మరణించారా అన్నదానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. 1985లో వచ్చిన 'కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్' సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను విలియం హర్ట్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa