ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ప్లాన్ చేస్తున్న చరణ్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 03:58 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చి 27న తన 37వ పుట్టిన రోజుని జరుపుకోనున్నారు. ఫ్యాన్స్ చెర్రీ బర్త్ డే ను ఈ సారి గట్టిగానే జరపాలని నిర్ణయించుకున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్ళ నుండి చెర్రీ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకోలేకపోతున్నందుకు ఒకింత బాధపడ్డా ఈ సారి ఆకంక్షలు లేకుండా జరుపుకునే అవకాశం ఉండటంతో చెర్రీ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 


మార్చి 25న రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో చరణ్ తన ఫ్యాన్స్ కు భారీ గిఫ్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారట అభిమానుల కోసం. అదేంటంటే ఆర్ ఆర్ ఆర్ తర్వాత చెర్రీ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా RC#15కు సంబంధించి ఒక న్యూ అప్డేట్ ఇస్తారట. RC#15 మూవీ టైటిల్, టీజర్ ఆర్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా ఏదైనా ఉండవచ్చని అనుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఏమి లేనప్పటికీ దాదాపు లాంఛనమే అని చిత్రవర్గ సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు మార్చి 27న తెరపడనుందేమో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa