ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ....

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 03:56 PM

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం జయాపజయాలతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసుకుంటూ చిత్ర సీమలో దూసుకుపోతున్నాడు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే కిరణ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన SR కల్యాణమండపం సినిమాతో కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్నాడు. 


తాజాగా ఆయన నటించిన చిత్రం సెబాస్టియన్ పీసీ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడమే విఫలమైంది. ఈ సినిమా ఫలితం పట్టించుకోకుండా మరో కొత్త సినిమాని లైన్లో పెట్టేసాడు కిరణ్. 


గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఒక సినిమాకి కిరణ్ సైన్ చేసాడు. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పెట్టి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు చిత్రబృందం. తాజాగా ఈ సినిమా షూటింగును ప్రారంభించినట్టు గీత ఆర్ట్స్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. 


ఈ సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటిస్తుండగా,కిరణ్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa