ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ సినిమాలో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 11:48 PM

జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే నట్టించనున్నారటా. త్రివిక్రమ్ తరువాత తన సినిమాల్లో ముఖ్యమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్ ను తీసుకునే దర్శకుడిగా కొరటాల కనిపిస్తారు. ఇంతవరకూ తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం ఆయన ఆమని ... నదియా .. దేవయాని .. సుకన్య .. సంగీత వంటి సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలను ఇస్తూ వచ్చారు. ఇక ఎన్టీఆర్ తో చేయనున్న తన తాజా చిత్రంలోనూ కొరటాల ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ కి అవకాశం ఇస్తున్నట్టుగా ఒక వార్త బలంగానే వినిపిస్తోంది. ఆ సీనియర్ హీరోయిన్ పేరే సోనాలి బింద్రే. కొంతకాలంగా కేన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన ఆమె, తిరిగి ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించడం జరిగిందని అంటున్నారు. బాలీవుడ్ బ్యూటీగా సొనాలికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆమె చేసిన 'మురారి' .. 'ఇంద్ర' .. 'ఖడ్గం' .. 'మన్మథుడు' భారీ విజయాలను అందుకున్నాయి. ఆమె ఎంపికలో వాస్తవమెంతన్నది చూడాలి. ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ అలరించనుంది. ప్రస్తుతం కొరటాల నుంచి 'ఆచార్య' .. ఎన్టీఆర్ నుంచి 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa