దర్శకుడు తూ.పా.శరవణన్,కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కాంబినేషన్ లో వచ్చిన 'సామాన్యుడు' సినిమా మార్చి 4నుండి ZEE5లో ప్రసారం చేయడం ప్రారంభమైంది.తెలుగు అండ్ తమిళ వెర్షన్‌లతో పాటుగా ఈ యాక్షన్ డ్రామా కన్నడ వెర్షన్ కూడా ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంది.ఈ చిత్రం మధ్యతరగతి సామాన్య ప్రజల కష్టాలను ఆధారం చేసుకొని ఆవిష్కరించింది.థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి అంతగా స్పందన రాలేదు కానీ OTT ప్లాట్ఫారం ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ సినిమాకి వ్యూయర్స్ ఎక్కువగానే ఉన్నారు.ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయతి జంటగా నటించింది.రవీనా రవి,యోగి బాబు అండ్ రమణ కీలక పాత్రల్లో కనిపించరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa