బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ 'దస్వీ' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.సోషల్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా డైరెక్ట్ గా OTTలో విడుదల కాబోతున్నట్లుగా సమాచారం.ఏప్రిల్ 7,2022 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ అండ్ జియో సినిమాలలో అందుబాటులో ఉంటుంది. సినిమా OTT విడుదల తేదీని ప్రకటించడానికి తాజాగా ఈ స్టార్ హీరో సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్‌ను పోస్ట్ చేసారు.గంగా రామ్ చౌదరి పాత్రలో ఈ హీరో కనిపించనున్నారు.ఈ సినిమాలో యామీ గౌతమ్,నిమ్రత్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.జియో స్టూడియోస్‌తో కలిసి మాడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa