ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ 'ఘనీ' అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 11:54 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'ఘని' మూవీ త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర,సునీల్ శెట్టి, జగపతి బాబు,నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ట్విట్టర్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సినిమా టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పొచ్చు.రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa