ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలను ప్రకటించిన 'RRR' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 12:03 PM

సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం 'RRR' టీమ్ అంతా సిద్ధంగా ఉంది.అందులో భాగంగా SS రాజమౌళి,ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఒక స్పెషల్ ఇంకా ఫన్నీ ఇంటర్వ్యూలో కనిపించనున్నారు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ రేపు విడుదల కానుంది.పాపులర్  యూట్యూబర్ భువన్ బామ్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ కోసం RRR దర్శకుడు అండ్ స్టార్ హీరోలని కలిసాడు.కామెడీ యూట్యూబ్ ఛానెల్ BBకి వైన్స్‌లో ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ ప్రొఫైల్స్‌లో అధికారికంగా ప్రకటించారు. 'TITU టాక్స్' అనే ఇంటర్వ్యూ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా  ఈ సినిమా విడుదల కానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa