ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసు మార్చుకున్నానని చెప్పిన రాజమౌళి... ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు తీయరా?....

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:16 PM

దర్శక ధీరుడు రాజమౌళి అబద్దం చెప్పారా? అవును నిజమే... టాలీవుడ్ జక్కన్న రామ్ చరణ్ తో మగధీర తీస్తున్న సమయంలో ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు చేయనని,ఇవి చాలా కష్టం తో కూడుకున్నవని చెప్పారు. ఇప్పుడదే విషయాన్ని మంగళవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో విలేకరులు అడిగారు. వెంటనే ఆయన తడుముకోకుండా సమాధానమిచ్చారు. "అప్పుడు అన్నానా.. అంటే ఇప్పుడు నేను నా మనసు మార్చుకున్నాను. రామ్ గోపాల్ వర్మలా అబద్దాలు చెప్పానుకోండి" అంటూ చమత్కరించారు. దీంతో ఆశ్చర్యపోవటం విలేఖరులవంతైంది. 


అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.పాన్ వరల్డ్ సినిమాలలో బాహుబలి కి మించి ఆర్ ఆర్ ఆర్  సినిమా ఉంటుందని, సినిమా సినిమాకి స్థాయి పెరుగుతుందని తెలిపారు. 


ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్,శ్రియ శరణ్,ఒలీవియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa