ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌ బాధితులకు అండగా 'చెర్రీ'

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 05:56 PM

ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందచేశారు హీరో రామ్‌చరణ్‌. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం లేదు. అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో ఫోన్‌ ద్వారా టచ్‌లో ఉన్నా. ఇటీవల ఆయనతో మాట్లాడాను. ఆయన తండ్రి 80 ఏళ్ళ వ్యక్తి గన్‌ పట్టుకుని యుద్థంలో పాల్గొంటున్నారు. ఆ విషయం తెలిసి మనసు ద్రవించింది. అందుకే నా వంతుగా కొంత డబ్బును వాళ్లకు పంపించాను’’ అని రామ్‌చరణ్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa