ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెయిన్ ఐకానిక్ లొకేషన్‌లో రవితేజ 'ధమాకా' షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 02:55 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా,భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఓ పాట షూటింగ్ కోసం మూవీ టీమ్ స్పెయిన్‌లో ఉంది.ఐరోపా దేశంలోని ప్లాజా డి ఎస్పానాలో ఈ షూటింగ్ జరుగుతోంది అని సమాచారం.ఈ ప్రదేశం స్పానిష్ మార్క్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి చెందింది.అయితే మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు.రవితేజ,శ్రీలీల,త్రినాధరావు,ప్రసన్నకుమార్ బెజవాడ,వివేక్ కూచిభొట్ల, శేఖర్ మాస్టర్,కార్తీక్ ఘట్టమనేని తదితరులు ఈ వర్కింగ్ స్టిల్‌లో కనిపిస్తారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa