ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన్ బామ్‌ గురించి స్టోరీ పోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 02:52 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళితో చేస్తున్న 'RRR' మార్చి 25,2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ మూవీ టీమ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లలో చాలా బిజీగా ఉంది. అందులో భాగంగానే పాపులర్ యూట్యూబర్ భువన్ బామ్‌కి ఎస్ఎస్ రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈరోజు,జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ని పోస్ట్ చేశాడు.'భువన్ బామ్‌ మీతో కలిసి ఈ వీడియోని షూట్ చేయడం చాలా సరదాగా గడిచింది' అని కాప్షన్ ఇచ్చారు.ఈ సినిమాలో అలియా భట్,అజయ్ దేవగన్,శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa