సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమాలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.తాజాగా 'RRR' మేకర్స్ కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం నుండి 'సెలబ్రేషన్ యాంథెమ్' పాటను రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసందే.ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.తాజా రిపోర్ట్స్ ప్రకారం,ఈ సాంగ్ యూట్యూబ్‌లో 15 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసింది అని సమాచారం.ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ఈ హై బడ్జెట్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa