ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బీస్ట్' సినిమా నుంచి అరబిక్ కుతు తరహాలో మరో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 08:59 AM

తమిళ స్టార్ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా బీస్ట్ సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సమకూర్చిన బాణీలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. బీస్ట్ సినిమా నుంచి వచ్చి అరబిక్ కుతు సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఫిబ్రవరి 14న విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదే తరహాలో బీస్ట్ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'జాలీ ఓ జింఖానా' అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌లో విజయ్‌, పూజా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పాటలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌, డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కనిపించారు. ఈ పాటను స్వయంగా హీరో విజయ్‌ పాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa