గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హీరో అమీర్ ఖాన్ తాజాగా వ్యాఖ్యలు తీవ్ర చర్చాంశనీయమయ్యాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ సినిమాకు మద్దతు పలికారు. ప్రతి భారతీయుడూ కశ్మీర్ ఫైల్స్ ను చూడాలని తాజాగా పిలుపునిచ్చారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాగా, నాటి నుంచి ప్రతి రోజూ బాక్సాఫీసు కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తూ వెళుతోంది. 1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణలను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకుకట్టినట్టు చూపించారు. బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం. వీరికి తాజాగా ఆమిర్ ఖాన్ జత కలిశారు. ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై స్పందన అడగ్గా.. ‘‘నిజమే, నేను తప్పకుండా ఈ సినిమాను చూస్తాను. ఈ సినిమా కథ చరిత్రలో భాగం. కశ్మీరీ పండిట్ల విషయంలో జరిగింది నిజంగా విచారకరం. అటువంటి అంశంతో కూడిన ఏ సినిమాను అయినా భారతీయులు అందరూ చూడాలి.మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి భావోద్వేగాలను ఈ సినిమా కదిలించింది. ఈ సినిమాలో ఉన్న అందమైన అంశం అదే. నేను తప్పకుండా ఈ సినిమాను వీక్షిస్తా. ఈ సినిమా విజయం సాధించినందుకు హ్యాపీగా వుంది’’ అని ఆమిర్ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa