ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం థియేటర్లలో..ఓటీటీలలో విడుదలవుతున్న చిత్రాలు ఇవే

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:43 PM

ఈ వారం సినిమా థియేటర్లు, ఓటీటీలు మోత మోగనున్నాయి. భారీ చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ వారమే విడుదలవుతోంది. దాదాపు రూ. 400 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే.  ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న చిత్రాలు వివరాలు ఇలావున్నాయి. ఇక థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు జాబితా  ఇలావుంది. ఆర్ఆర్ఆర్: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు:


భీమ్లా నాయక్: పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలయింది. త్రివిక్రమ్ సంభాషణలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 25 నుంచి ఈ చిత్రం ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో విడుదల కాబోతోంది. వలిమై: తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన 'వలిమై' ఫిబ్రవరి 24 విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తికేయ నెగెటివ్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం మార్చి 25న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa