ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాడ్ ఫాదర్ నుండి కొత్త అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 02:38 PM

మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. 2019లో విడుదలైన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు ఈ మూవీ తెలుగు రీమేక్. మెగాస్టార్ కి ఇది 153వ సినిమా. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా, సత్యదేవ్, సునీల్, కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక అతిధి పాత్రలో నటిస్తుండటం విశేషం.
గత వారం నుండి ముంబై లో మెగాస్టార్, సల్మాన్ ఖాన్ ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారంతో వీరిద్దరి కాంబో సీన్స్ షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సల్మాన్, చిరంజీవి, దర్శకుడి తో  దిగిన ఫోటోని సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు నిర్మాతలు. ఈ మూవీ లో సల్మాన్ ప్రెజన్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని, మెగాస్టార్ సల్మాన్ కాంబో సీన్స్ మూవీ కి హై లైట్ గా నిలుస్తాయని తెపారు. దీంతో ఈ మూవీ ముంబై షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ వివరాలు తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa