ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ అవార్డ్స్ 2022: ఇండియా టెలీకాస్టింగ్ డేట్,టైం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 04:51 PM

సినీ ప్రేమికులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. ఈ అవార్డులను జీవితంలో ఒక్కసారైన అందుకోవాలని ఎంతోమంది ఆరాటపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 27న జరగనున్న సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 27న రాత్రి 8గంటలకు ఈ వేడుక ఎంతో ఘనంగా జరగనుంది. అయితే ఇండియా లో ఈ షో మార్చి 28న సాయంత్రం ఆరున్నర గంటల నుండి స్టార్ వరల్డ్, స్టార్ మూవీస్ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి ఈ షోలో పాల్గొంటారు ప్రముఖ హాలీవుడ్ స్టార్లు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa