ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం శుక్రవారం(మార్చి25న) విడుదల కానుంది. ఈ సినిమా విడుదలలో అభిమానులకు తెలంగాణ సర్కారు షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో కేవలం 5 థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షో వేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్, మూసాపేట శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ఉ.7గంటల కన్నా ముందు శుక్రవారం మాత్రమే అదనపు షో వేసేందుకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు పట్టించుకోకుండా మిగిలిన థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటించారు. వారి సరసన ఒలివియా మోరిస్, అలియా భట్ జోడీ కట్టారు. ఇక బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు.