‘ధడక్’ ట్రైలర్ విడుదల .అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ తెరంగ్రేటం చేసిన ధఢక్ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఇషాన్ హీరో. శశాంక్ కైతన్ అందమైన ప్రేమకథలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. స్వాతంత్య్రాన్ని కోరుకునే ఇద్దరు యువతీయువకులు ప్రేమలో పడతారు. ఇద్దరు ప్రేమలో పడ్డాక వారి జీవితం మారిపోతుంది. కుటుంబాల్లో కలతలు మొదలౌతాయి. వీరి ప్రేమను రెండు కుటుంబాలవారు ఒప్పుకోరు. ఆ తరువాత ఏం జరిగింది అన్నది మూలకథ. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తన తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో అచ్చు శ్రీదేవిని తలపించేలా ఉంది. మొత్తానికి జాన్వీ తెరంగ్రేటం అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa