ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను క్షమించు జాన్వి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 11, 2018, 02:00 PM

బాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి చూపు దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌పైనే ఉంది. ఎందుకంటే ఆమె నటించిన తొలి చిత్రం ‘దఢక్‌’ ట్రైలర్‌ ఈరోజు విడుదల కాబోతోంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్లలో ఎంతో ఆకట్టుకుంటున్న జాన్విపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి జాన్వి సోదరుడు అర్జున్‌ కపూర్‌ హాజరుకాలేకపోతున్నారు.


ఈ నేపథ్యంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరిని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఈరోజు నువ్వు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతావు జాన్వి. ఎందుకంటే ఈరోజు నువ్వు నటించిన తొలి చిత్రం ‘దఢక్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కాబోతోంది. నేను ముంబయిలో లేనందున నీ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు. కానీ నేను నీ పక్కనే ఉంటాను. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు కష్టపడితే సినిమా రంగం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అన్నింటికీ నువ్వు సిద్ధంగా ఉంటేనే ఈ వృత్తిని నువ్వు ఎంజాయ్‌ చేయగలుగుతావు. ‘దఢక్‌’ సినిమా త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా ఆల్‌ ది బెస్ట్‌. నా స్నేహితులు కరణ్‌ జోహార్‌, శశాంక్‌ ఖైతాన్‌ కలిసి నీకు, ఇషాన్‌ ఖత్తర్‌కు మోడ్రన్‌ రోమియో-జూలియట్‌‌ సినిమాను అందించి ఉంటారని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు అర్జున్‌.


అర్జున్‌..బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా కుమారుడు. శ్రీదేవి చనిపోవడంతో కుటుంబం అంతా కలిసిపోయింది. అర్జున్‌, అన్షులా కలిసి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషిలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దీటుగా సమాధానాలిచ్చి వారి నోళ్లు మూయిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa