ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఆర్ఆర్ అడిషనల్ షోలు ఈ థియేటర్లలోనే

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 06:37 PM

హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ చిత్రం అడిషనల్ షోలు ప్రదర్శించనున్నారు. తెలుగు సినీ చరిత్రలో భారీ చిత్రాల మొనగాడుగా పేరుగాంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' రేపు (మార్చి 25) విడుదల అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటవిశ్వరూపం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తొలి ఆట చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలావుంటే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని హైదరాబాదులోని 5 థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. అర్జున్ థియేటర్ (కూకట్ పల్లి), మల్లికార్జున (కూకట్ పల్లి) భ్రమరాంబ (కూకట్ పల్లి), విశ్వనాథ్ (కూకట్ పల్లి), మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో ఈ స్పెషల్ షోలకు అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోలు ఉదయం 7 గంటల కంటే ముందే ప్రారంభం కానున్నాయి. వీటి అనంతరం, బెనిఫిట్ షోలు ఉదయం 7 గంటల నుంచి షురూ అవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa