ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో స్టార్ హీరో బయోపిక్ తో వస్తున్న రామ్ గోపాల్ వర్మ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 06:56 PM

బయోపిక్ లు తీయడంలో ఆరితేరిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో కొత్త ప్రాజెక్టుతో ముందుకొస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు ఆర్జీవీ రాబోతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఒక కన్నడ స్టార్ హీరోను ఎంచుకున్నారు. ఆయన ఎవరో కాదు... ఉపేంద్ర. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఆర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి రెండు గ్లింప్స్ లను వర్మ రిలీజ్ చేశారు. ఒక భయంకరమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa