ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరు..వాడ..దేశ...విదేశాల్లో...ఆర్ఆర్ఆర్ కు విపరీత ఆదరణ

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 27, 2022, 08:43 PM

ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు, తమిళం, హిందీనే కాదు.. విదేశాల్లోనూ ఆ సినిమా రఫ్ఫాడించేస్తోంది. చల్లటి హిమాలయ దేశం నేపాల్ లోనూ వేడి పుట్టిస్తోంది. అక్కడ అభిమానులు తెగ చిందులేస్తున్నారు. థియేటర్లలో మోత మోగిస్తున్నారు. స్క్రీన్ల దగ్గరకు వెళ్లి డ్యాన్సులాడుతున్నారు. ఆ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటు తమిళనాడులోని సేలంలో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్ వద్ద ఎగబడ్డారు. నిన్న రాత్రి షో సినిమా టికెట్ల కోసం భారీ సంఖ్యలో జనం థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులతో వీధులు, జంక్షన్లు కిక్కిరిసిపోయాయి.  చుట్టుపక్కల రోడ్లన్నీ ‘ఆర్ఆర్ఆర్ అభిమాన సంద్రం’గా మారాయి. ఆ అభిమాన సంద్రంలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు ఆటంకం కలిగింది. ఆ వీడియోను ఓ అభిమాని పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa