విజయ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. అలాంటి పండుగ ఏప్రిల్ 13వ తేదీన రానుంది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఒక్క హిందీలో తప్ప మిగతా భాషల్లో ఈ సినిమా 'బీస్ట్' టైటిల్ తోనే పలకరించనుంది. హిందీలో మాత్రం ఈ సినిమాకి 'రా' ( RAW) అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ టైటిల్ తోనే ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే జనం నుంచి మంచి మార్కులు సంపాదించుకుంది. విజయ్ క్రేజ్ కి తగినట్టుగానే రానున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమా కోసం ఆమె అత్యధిక పారితోషికం అందుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. 'కేజీఎఫ్ 2' వంటి క్రేజీ ప్రాజెక్టుతో పోటీపడుతూ ఈ సినిమా రంగంలోకి దిగుతుండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa