యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నాగశౌర్యం కొత్త చిత్రం టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీశ్ కృష్ణ 'Krishna Vrinda Vihari' సినిమాను రూపొందిస్తున్నాడు. నాగశౌర్య సొంత బ్యానర్ అయిన 'ఐరా' క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో నాగశౌర్య సరసన నాయికగా 'షిర్లే సెటియా' పరిచయం కానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి. టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa