రామ్ చరణ్ ఇపుడు ఎలాంటి చిత్రం తీయబోతున్నారు అన్నది సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న చర్చ. రాజమౌళి సినిమా 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఎన్టీఆర్ తో పాటు చరణ్ చాలా సమయాన్ని కేటాయించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందుకు తగిన ప్రతిఫలం లభించినట్టు అయింది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి రావడానికి 'ఆచార్య' సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోనూ చరణ్ పోరాట వీరుడిగానే కనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ కి కావలసిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును కూడా చరణ్ పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో నడుస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ కొత్తగా ఉంటుందట .. ఇంతవరకూ వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa