పుష్క సినిమా హిట్ కు సమంత ఐటం సాంగ్ కూడా ఒక భాగమైంది. దీంతో దానికి సీక్వెల్ గా వచ్చే పుష్పా-2లోనూ ఐటం సాంగ్ అందులోనూ సమంత నట్టించనున్నదని ప్రచారం మొదలైంది. ఇదిలావుంటే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' .. అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బలమైన కథాకథనాలు .. పాత్రలను విభిన్నంగా తీర్చిదిద్దిన తీరు .. పాటలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా 'ఊ అంటావా' అనే పాటలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా ఆ పాట జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. జూన్ ... జూలైలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆ ఐటమ్ భామగా ఈ సారి దిశా పటాని కనిపించనుందనే టాక్ వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ భామనే రంగంలోకి దింపుతున్నారట. అయితే ఈ సినిమాలోనూ సమంత మెరవనుందనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది. ఒక ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. తన అభిమాన తార సమంత అని చాలా వేదికలపై సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె పట్ల గల ఆ అభిమానంతోనే ఆమె కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa