టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ చేతులు మీదుగా నేడు కేజీఎఫ్-2 ట్రైలర్ విడుదలైంది. కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ కు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, కేజీఎఫ్-2 ట్రైలర్ వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్... ఈ చిత్రంపై స్పందిస్తూ, తర్వాత వచ్చే పెను తుపాను ఇదేనంటూ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. హీరో యశ్ కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్-2 కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, మాళవికా అవినాష్, అయ్యప్ప పి శర్మ, రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై కేజీఎఫ్-2 చిత్రాన్ని విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తుండడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa