సౌత్ ఇండియాలో "KGF1" సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు.ఇప్పుడు అందరూ "KGF2" కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 14,2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్‌లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ బెంగళూరులో విడుదల చేశారు.తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13న విడుదలవుతుండగా,'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న రానుంది.ఇదే విషయమై కేజీఎఫ్ 2 హీరో యష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'కేజీఎఫ్ 2 అండ్ బీస్ట్ మధ్య క్లాష్ ఏమిలేదు.ఇది రాజకీయం కాదు.సినిమాలు చేస్తున్నాం. లేనిపోని క్లాష్‌ని ప్రొజెక్ట్ చేయడం కంటే ఈ రెండు సినిమాలని సెలెబ్రేట్ చేసుకుందాం.నేను 'బీస్ట్' టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని యష్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa