ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌత్ సినీ ఇండస్ట్రీపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 05:22 PM

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం ‘టైగ‌ర్’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో తలమునకలై ఉన్నాడు. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి ‘గాడ్‌ఫాద‌ర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఓ కీల‌క‌పాత్ర‌లో సల్మాన్ నటించాడు. అయితే ఆ పాత్రకు సంబంధించి రెమ్యూనరేషన్ తీసుకోవడానికి నిరాకరించాడు. ఇటీవ‌లే చిరంజీవి-స‌ల్మాన్ ఖాన్ మధ్య వివిధ సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. మళయాలంలో సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ సినిమా రూపొందుతోంది. దీనికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ారు.
తాజాగా ‘ఐఫా’ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘గాడ్ ఫాద‌ర్’ సినిమాల‌ గురించి స‌ల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవితో పనిచేయ‌డం చాలా సంతోషమని, ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా తనకు మంచి మిత్రుడని చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడని ప్రశంసించాడు. దక్షిణాది చిత్రాల్లో హీరోయిజం బాగుటుందని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి దోహదపడుతుందని చెప్పాడు. అది బాలీవుడ్‌లో కనిపించడం లేదన్నాడు. కథ విషయంలోనూ, హీరోయిజాన్ని తెరపై అద్భుతంగా చూపించడంలో దక్షిణాది రచయితలు, దర్శకులు బాగా కష్టపడతారని కితాబిచ్చాడు. దక్షిణాది కథలను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారని, కానీ బాలీవుడ్ కథలు అక్కడ రీమేక్ చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa