టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారువారిపాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన సరసన మహానటి కీర్తిసురేష్ నాయికగా అలరించనుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ , GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం.
ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన మొదటి పాట కళావతి యూట్యూబులో దుమ్మురేపుతోంది. ఈ మెలోడియస్ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తరవాత విడుదలైన పెన్నీ సాంగ్ కూడా ఒక రేంజులో దూసుకుపోతుంది. ఈ పాటలో మహేష్ గారాల పట్టి సితార మెరుపులు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజాగా ఈ సినిమా నుండి మూడో పాటని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట సంగీత దర్శకుడు థమన్. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా మూడో పాటని విడుదల చేస్తారని నెట్టింట ప్రచారం జరుగుతుంది. అయితే పాటని రిలీజ్ చేస్తారా? లేక ట్రైలరా? అన్నది మాత్రం క్లారిటీ లేదు.
ఈ సినిమాలో సముద్రఖని, సుబ్బరాజ్, వెన్నెలకిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa