యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది అని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని బ్రేక్-అప్ సాంగ్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటను ప్రకటించడానికి విశ్వక్ సేన్ అండ్ సినిమా రచయిత రవికిరణ్ కోలా ఉన్న ఒక ఫన్నీ ప్రోమో వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. 'రాంసిలక' అనే టైటిల్ తో ఈ పాటను రేపు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్‌ఎన్ ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు రవికిరణ్ కోలా అందించారు. ఈ చిత్రంలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa