బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీకపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను జాతీయ అవార్డు గ్రహీత నితేష్ తివారీ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకి 'బవాల్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. క్యూట్ అండ్ లవ్లీ హీరోయిన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో 'బవాల్' టైటిల్ కార్డ్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ఈ బ్యూటీ రొమాన్స్ చేయనుంది. సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'బవాల్' ఏప్రిల్ 7, 2023న థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa