ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘోరం.. ఆ నటిపై దర్శకుడి అత్యాచారం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 06:02 PM

ఓ నటిపై సినీ దర్శకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేస్తుండగా తీసిన వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి 2017 మే నుంచి ఆమెపై దర్శకుడు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ యువతి(21) సినీ పరిశ్రమలో నటిగా పనిచేస్తోంది. ఆమెకు దర్శకుడు అమిత్ సిత్లానితో 2017 మేలో ఓ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన పార్టీలో పరిచయం ఏర్పడింది. అక్కడే తొలిసారి నటిపై దర్శకుడు అమిత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అలా భయపెట్టి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. తనకు సినీ పరిశ్రమలో చాలా మంది సన్నిహితులు ఉన్నారని, ఈ విషయం బయట చెప్తే తనకు అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఎట్టకేలకు ఆ నటి విశ్వంత్​వాడీ పోలీస్​స్టేషన్​ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa