వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగ రంగ వైభవంగా' సిద్ధమవుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. జూలై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సంగీతం ఈ సినిమా పైకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ యూత్ లో ఆసక్తిని పెంచాయి. 'ఉప్పెన' .. 'కొండ పొలం' తరువాత వైష్ణవ్ తేజ్ చేసిన సినిమా ఇది. ఇక 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కేతిక శర్మ కి కూడా ఇది మూడో సినిమానే. గ్లామర్ పరంగా కేతికకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa