విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత 'కాతువాకుల రెండు కాదల్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా అప్‌డేట్ ప్రకారం, సమంత, నయనతార అండ్ విజయ్ సేతుపతి చెన్నైలో సినిమా ప్రమోషన్స్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు, మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఈ సినిమా OTT విడుదల అవుతుందని వార్తలు వినిపించాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa