ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'NTR30'లో డ్యూయల్ రోల్ లో కనిపించనున్న తారక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 11:14 AM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాని గత ఏడాది ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ నటిస్తుంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని ఎన్టీఆర్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో స్వయంగా వెల్లడించాడు. 2023 ప్రారంభంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa