వివేక్ కుమార్ కణ్ణన్ దర్శకత్వంలో ప్రియమణి, బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్, సారా అర్జున్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం కొటేషన్ గ్యాంగ్. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడింది. తాజాగా ఈ సినిమా నుండి లీడ్ రోల్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శకుడు. ముఖమంతా రక్తంతో, దేనికో భయపడి అరుస్తున్నట్టు ప్రియమణి, సారా ఫస్ట్ లుక్ పోస్టర్లుండగా, భయంకరమైన లుక్లో సన్నీ లియోన్, జాకీ ష్రాఫ్ ల పోస్టర్లున్నాయి. లైఫ్... హ్మ్ లైఫ్... మనం చనిపోయేముందు వరకు జరిగే బహుళస్థాయి రహస్యం అంటూ పోస్టర్లకు కాప్షన్ ఇచ్చారు. దీన్ని బట్టి ఒక సీరియస్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది.
ఈ సినిమాలో ప్రియమణి శకుంతలాగా నటిస్తుండగా, పద్మగా సన్నీ లియోన్, ముస్తఫా గా జాకీ ష్రాఫ్, ఐరా గా సారా అర్జున్ నటిస్తున్నారు. విడుదలైన ఈ పోస్టర్లన్నిటికి ప్రియమణి లుక్ మరింత భయంకరంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa