2018లో చడీచప్పుడు కాకుండా విడుదలై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా కేజిఎఫ్ చాప్టర్-1. కోలార్ బంగారు గని నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, యష్ హీరోగా నటించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో యష్,దర్శకుడు ప్రశాంత్ నీల్ లకు ఓవర్ నైట్ పాన్ ఇండియా ఇమేజ్ ను తీసుకొచ్చిన చిత్రమిది.
కేజిఎఫ్ చాప్టర్-1 భారీ హిట్ అవ్వడంతో చాప్టర్ -2 పై మొదటి నుండి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేజిఎఫ్ అభిమానుల ఎదుచూపులకు తెరదించుతూ ఏప్రిల్ 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాలని ముమ్మరం చేసింది కేజీఎఫ్ చిత్రబృందం. ప్రచారం లో భాగంగా కేజీఎఫ్ ఫస్ట్ పార్టును మళ్ళీ విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట నిర్మాతలు.
దేశవ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్-1ను ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కేవలం సబ్సిడీ ధరలకే ఈ సినిమాను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు కల్పిస్తూ కేజీఎఫ్ చాప్టర్-2 కు కావాల్సినంత ప్రమోషన్స్ ను చేసుకుంటున్నారు ఈ చిత్ర నిర్మాతలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa