ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగాది రోజే బాలయ్య చిత్రం పేరు ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 01:13 PM

బాలయ్య సినిమాకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లింది. రాయలసీమ నేపథ్యంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 2వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. అలాగే ఫస్టు గ్లింప్స్ ను కూడా వదలనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలతో బిజీగా ఉన్నారని అంటున్నారు.  ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడని చెబుతున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, పవర్ఫుల్ ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. ఈ దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa