ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పక్కా కమర్షియల్' స్పెషల్ పోస్టర్ ఆవిష్కరణ

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 02:08 PM

గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమా స్పెషల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇదిలావుంటే మారుతి నుంచి వచ్చిన 'ప్రతి రోజూ పండగే' సినిమా ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిగింది. అయితే ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత కరోనా కారణంగా మారుతి నుంచి కూడా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య కరోనా కాస్త తగ్గగానే, 'మంచి రోజులు వచ్చాయి' అనే ఒక చిన్న సినిమాతో తన మార్కు వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తరువాత  గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా అలరించనుంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.  యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. 'జిల్' తరువాత గోపీచంద్ - రాశి ఖన్నా కలిసి నటించిన సినిమా ఇది. సత్యరాజ్ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa