అనుష్క ఎవరు మర్చిపోలేని నటి కానీ ఇటీవల సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కథానాయిక అనుష్క నుంచి 'నిశ్శబ్దం' తరువాత ఇంతవరకూ ఏ సినిమా రాలేదు. గ్లామర్ పరమైన పాత్రలు చేయడం ఆమె మానేసి చాలా కాలమే అయింది. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టుగా చెప్పుకున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. కానీ సైలెంట్ గా ఈ సినిమా షూటింగు జరిగిపోతోందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈ నెల 4వ తేదీన మొదలవుతుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే టైటిల్ ను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇంతకుముందు ఈ బ్యానర్లో 'మిర్చి' .. 'భాగమతి' చేసిన అనుష్కకి ఇది మూడో సినిమా. ఈ సినిమాకి మహేశ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa