సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'స్పైడర్' మూవీ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండగా మరో మూవీ 'భరత్ అనే నేను' కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే... ఇంకా.. ఆ మూవీస్ రిలీజ్ కాకముందే మహేశ్ 25 వ చిత్రం ప్రారంభమైంది. కృష్ణాష్టమి సందర్భంగా ఇవాళ ఆ మూవీ కి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. స్పైడర్ మూవీ బిజీ షెడ్యూల్ వల్ల మహేశ్ పూజా కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ని అశ్వినీ దత్, దిల్ రాజు నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మహేశ్ కొడుకు గౌతమ్ క్లాప్ కొట్టగా.. మహేశ్ గారాలపట్టి సితార కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ కార్యక్రమంలో మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్, దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు, అశ్వనీదత్, రాఘవేంద్రరావు, వీవీవినాయక్, వంశీ పైడిపల్లి, గౌతమ్, సితార తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa