ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చేవాళ్లకి కొన్ని కష్టాలు తప్పవంటున్నది బాలీవుడ్ నటి రాధికా ఆప్టే.. ఆమె కూడా కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడిందట. ఎప్పటికీ ఎలాంటి చిత్రాల్లో నటించకూడదనుకున్నానో అలాంటి వాటిలో కెరీర్ ప్రారంభంలోనే నటించాను. ఎందుకంటే బతకడానికి అవసరమైన డబ్బు కోసం తప్పలేదని తెలిపింది. ‘బద్లాపూర్’, ‘హంటర్’, ‘ప్యాడ్‌మ్యాన్’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొన్న ఆమె ఇప్పుడు తనకు నచ్చిన సినిమాల్ని ఎంచుకోగలుగుతోంది. ఇప్పుడు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కొన్నిసార్లు తప్పకపోయినా ఎక్కువశాతం నచ్చిన కథల్నే అంగీకరిస్తున్నాను. యుద్ధం చేయాల్సిందే…ఒక్కరోజులోనే అన్నీ సాధ్యం కావు కదా అని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa