మత్తు వదలారా, సేనాపతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. మురళి కాట్రగడ్డ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి 'అసురగణ రుద్ర' అనే టైటిల్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో నరేష్ అగస్త్య సరసన మలయాళ యాక్ట్రెస్ సంగీత విపిన్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, మురళీ శర్మ, శత్రు, అమిత్, ఆమని, దేవిప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్ పతాకంపై మురళీ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 6, 2022 నుండి ప్రారంభమవుతుంది అని మూవీ మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa